TG-3583
Telugu

కూర్చుందును నీ సన్నిధిలో

Koorchundunu Nee Sannidhilo

0
views
పల్లవి

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||

1వ చరణం

ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా (2) నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) నీ నామమునే హెచ్చించెదా (2) నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

2వ చరణం

ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా (2) నీ వాక్యానుసారము జీవించెదా (2) నీ ఘన కీర్తిని వివరించెదా (2) నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||