♪♫
TG-4121
Telugu
ప్రభువా నే నిన్ను నమ్
Prabhuvaa Ne Ninnu Nammi
0
views
పల్లవి
ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా||
1వ చరణం
గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు (2) ||ప్రభువా||
2వ చరణం
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా||