♪♫
TG-4123
Telugu
రభువా నీలో జీవించుట
Prabhuvaa Neelo Jeevinchuta
0
views
పల్లవి
ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||
1వ చరణం
సంగీతములాయె పెను తుఫానులన్నియు (2) సమసిపోవునే నీ నామ స్మరణలో (2) సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||
2వ చరణం
పాప నియమమును బహు దూరముగా చేసి (2) పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా||
3వ చరణం
నీలో దాగినది కృప సర్వోన్నతముగా (2) నీలో నిలిచి కృపలనుభవించి (2) నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా||
4వ చరణం
నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి (2) నూతనమైన శుభాకాంక్షలతో (2) నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||