♪♫
TG-4120
Telugu
ప్రభువా మాకు నీవిచ్చిన
Prabhuvaa Maaku Neevichchina
0
views
పల్లవి
ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనది మా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2) గర్భములో రూపింపబడిన నాటినుండి కాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2) నీ సన్నిధిలో నిలిపే దయ చూపవా నీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2) ||ప్రభువా||
1వ చరణం
నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యా నీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2) తన చేతులతో నీ సేవను చేస్తూ తన పెదవులతో నిను స్తుతియించాలయ్యా (2) ప్రార్థనాపరురాలిగ ఉండాలయ్యా ||నీ సన్నిధిలో||
2వ చరణం
నీ వాక్యము తన హృదయములో పదిలముగా ఉండాలయ్యా నీ తలంపులు అన్ని వేళలా తన మదిలో నిండాలయ్యా (2) నీ దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లేలా నీవే దీవించయ్యా (2) నీ ప్రియమైన బిడ్డగా స్థిరపరచయ్యా ||నీ సన్నిధిలో||