♪♫
TG-4119
Telugu
ప్రభువా కాచితివి
Prabhuvaa Kaachithivi
0
views
పల్లవి
ప్రభువా… కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||
1వ చరణం
కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) నన్ను వలచావులే – మరి పిలిచావులే (2) అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||
2వ చరణం
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) పాపము కడిగావులే – విషము విరచావులే (2) నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా||
3వ చరణం
బాధలను బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2) నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||