TG-3612
Telugu

కుమ్మరి ఓ కుమ్మరి

Kummari O Kummari

0
views
పల్లవి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||

1వ చరణం

విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||

2వ చరణం

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||