TG-506
Telugu

మహిమ మహిమ మహిమ యనుచు

mahima mahima mahima yanuchu

208
views
పల్లవి

మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ మహిమ||

1వ చరణం

శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ మహిమ||

2వ చరణం

వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు ||మహిమ మహిమ||

3వ చరణం

తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి ||మహిమ మహిమ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.