♪♫
TG-5558
Telugu
మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
Maa Naanna Yintiki Neenu Vellllaali
0
views
పల్లవి
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి నా తండ్రి యేసుని నేను చూడాలి (2) నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||
1వ చరణం
మగ్ధలేని మరియలాగా (2) నీ పాదాలు చేరెదను (2) కన్నీటితో నేను కడిగెదను (2) తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న||
2వ చరణం
బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను (2) నీ వాక్యమును నేను ధ్యానింతును (2) ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న||
3వ చరణం
నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా (2) పరలోక ఆనందం పొందెదను (2) ఈ లోకమును నేను మరిచెదను (2) ||నా నాన్న||