చిరకాల స్నేహం నీప్రేమ చరితం చిగురించే నాకొసమే
Chirakaala Sneehan Neepreema Charithan Chigurinchee Naakosamee
చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2) నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2) 1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2) నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల||
2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2) సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా తోడు నీవే యేసయ్యా ||చిరకాల||
3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు (2) శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా నిలిపినావు యేసయ్యా ||చిరకాల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.