♪♫
TG-5578
Telugu
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు
Maanavula Meelu Koraku Jnyaaniyaina Deevundu
0
views
పల్లవి
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల||
1వ చరణం
1. కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||
2వ చరణం
2. యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల||
3వ చరణం
3. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల||
4వ చరణం
4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||