భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు

bhuumipai yeesu jeevinchenu - chuudu paadanbula jaadalu

🎵 TG-1154🌐 Telugu
పల్లవి

భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు నీకును,నాకును మాధిరి - నీకును,నాకును మాధిరి

1వ చరణం

శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు గెల్చెను యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని ||భూమిపై యేసు||

2వ చరణం

ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి దాడి చేయు భాధను సోధనాధికంబును సూటిగా ధీటుగా నిల్వగా - సూటిగా ధీటుగా నిల్వగా ||భూమిపై యేసు||

3వ చరణం

దూతాళి సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను ప్రేమ సంపూర్ణుడు యేసుడు - ప్రేమ సంపూర్ణుడు యేసుడు ||భూమిపై యేసు||

Report Error