TG-1158
Telugu

మంచిగా పిలచినా నా యేసయ్యా

manchigaa pilachinaa naa yeesayyaa

198
views
పల్లవి

మంచిగా పిలచినా నా యేసయ్యా నీ స్వరము నాకు ఎంతో ప్రీతి కరము (2) పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

1వ చరణం

చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి (2) పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2) ||మంచిగా పిలచినా||

2వ చరణం

లేమినుండి నన్ను నీ కలిమిలోనికి శాపము నుండి నన్ను సంవృద్ధిలోనికి (2) పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2) ||మంచిగా పిలచినా||

3వ చరణం

మట్టి నుండి నన్ను నీ మహిమలోనికి క్షయత నుండి నన్ను అక్షయతలోనికి (2) పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2) ||మంచిగా పిలచినా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.