భూనివాసులకు - ఈ లోక నివాసులకు

bhuunivaasulaku - ee looka nivaasulaku

🎵 TG-1156🌐 Telugu
పల్లవి

భూనివాసులకు - ఈ లోక నివాసులకు యేసే జీవం - యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు

1వ చరణం

పరిసరములలోని - పండిన పైరంతా రాలిపోవు చుండ - సంతాపమే లేదా కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు ఓ దైవ సేవకుడా - ఇకనైనా మేల్కొనవా ||భూనివా||

2వ చరణం

పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని పౌలువంటి భక్తులు - ప్రాణాలు తెగియించిరి దేవుని వాక్యము - దేదీప్యమానము దీనుడవై యెపుడు - దీక్షతో చాటించు ||భూనివా||

3వ చరణం

సువార్త భారమును - సంపూర్ణ భాద్యతతో మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు దేవుని మార్గము - పూజనీయము దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు ||భూనివా||

4వ చరణం

సంఘమ మేల్కొనుమా - సాతానునెదిరించుమా సర్వాంగ కవచమును - ధరియించి పోరాడుము చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై జ్వాలను రగిలించు - రక్షణ ప్రకటించు ||భూనివా||

Report Error