భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త
bhajiyinthumu ninu jagadeeshaa - shreeyeesaa maa rakssanna kartha
🎵 TG-1155🌐 Telugu
పల్లవి
భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త (2) శరణు, శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి
1వ చరణం
విమల సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే మా యాఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే ||శరణు||
2వ చరణం
ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం ||శరణు||