మంచి దేవుడు భలే మంచి దేవుడు

manchi deevudu bhalee manchi deevudu

🎵 TG-1159🌐 Telugu
పల్లవి

మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు

1వ చరణం

మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు ||మంచి||

2వ చరణం

కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు ||మంచి||

3వ చరణం

చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను ఏమి చేతువో - సృష్టికర్త యేసుని ||మంచి||

Report Error