♪♫
TG-1157
Telugu
మంచి కాపరి మాప్రభు యేసే
manchi kaapari maaprabhu yeesee
199
views
పల్లవి
మంచి కాపరి మాప్రభు యేసే.... మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి మరణ మన్నను భయము లేదులే మదురమైన ప్రేమతో మమ్ము కాయులే
1వ చరణం
పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయివిడువకా తోడు నిలచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును ||మంచి||
2వ చరణం
అందకారలోయలో మా పయనంలో లేదులే మాకు భయం అభయం తానే ఆదరించును ఆశీర్వదించును అన్ని తావులయందు తానే తోడైయుండును ||మంచి||
3వ చరణం
శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమమే బ్రతుకు నిండగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవింపగా ||మంచి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.