నీధనము నీఘనము ప్రభు యేసుదే
needhanamu neeghanamu prabhu yeesudee
నీధనము నీఘనము ప్రభు యేసుదే నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీధన||
పాడిపంటలు ప్రభువు నీకియగా - కూడుగుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా ||నీధన||
వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభునీకు ఉచితంబుగా వెలిగించ ధరయందు ప్రభు నామము - కలిమి కొలది ప్రభునకర్పించవా ||నీధన||
కలిగించే సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంభులు బలియాయె నీపాపముల కేసుడు - చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీధన||
పరిశుద్ద దేవుని మంధిరమున్ - పరిపూర్ణముగాను యోచించుడి పరిశుద్ధ బాగంబు విడదీయుడి - పరమాత్మ దీవెనలను బొందుడి ||నీధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.