నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా

neekunna bhaaramantha prabhupai nunchu - kalavara chendakumaa

🎵 TG-1115🌐 Telugu
పల్లవి

నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా.. ఆయనె నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్‌

1వ చరణం

నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును ||నీకున్న భారమంత||

2వ చరణం

మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును ||నీకున్న భారమంత||

3వ చరణం

తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును ||నీకున్న భారమంత||

4వ చరణం

ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు ||నీకున్న భారమంత||

5వ చరణం

ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును ||నీకున్న భారమంత||

6వ చరణం

మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా ఆయనే మనలను ఆధరించును - అద్భుతములు చేయును.. ||నీకున్న భారమంత||

Report Error