నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
nee mukhamu manooharamu - nee svaramu maadhuryamu
🎵 TG-1120🌐 Telugu
పల్లవి
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1వ చరణం
నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్య||
2వ చరణం
నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్య||
3వ చరణం
నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో ||యేసయ్య||