రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
rakssakundudayinchnaamdamta manakorakumbarama rakssakum dudayinchi
రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ బోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||
గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||
వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||
పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ||