మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని

muudu dashaabdaala vaivaahika jeevithaanni

🎵 TG-2679🌐 Telugu
పల్లవి

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం (2) వందనం వందనం… వందనం నీకే మా వందనం దేవా ||మూడు దశాబ్దాల||

1వ చరణం

పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2)        ||వందనం||

2వ చరణం

బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2)       ||వందనం||

3వ చరణం

మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన దేవా (2)         ||వందనం||

Report Error