TG-3725
Telugu

నా దేహమును

Naa Dehamunu

0
views
పల్లవి

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును||

1వ చరణం

నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము నా దేహమును భయముతో భక్తితో నీ కొరకు పరిశుద్ధముగా దాచెద ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము ||నా దేహమును||

2వ చరణం

నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించును ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను విస్తారముగా దేవా ఫలియింతును నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు ||నా దేహమును||