పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర
padaree soodarulaara pammapurimjeera madhura
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు డేసునిఁ గూడి ||పదరే సోదరులార||
ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గుఁ ||పదరే సోదరులార||
ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణిఁ గన్గొని వడిగఁ ||పదరే సోదరులార||
ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరుఁ ||పదరే సోదరులార||
పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద ||పదరే సోదరులార||
ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే సోదరులార||
మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి ||పదరే సోదరులార||
భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా సక్తితోఁ జూతము ||పదరే సోదరులార||