♪♫
TG-3752
Telugu
నా మనో నేత్రము తెరచి
Naa Mano Nethramu Therachi
0
views
పల్లవి
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో||
1వ చరణం
నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో||
2వ చరణం
ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2) బాధలు శోధనలు శ్రమలలో (2) ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో||
3వ చరణం
నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2) స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||