ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
aayanee naa sangeethamu - balamaina kootayunu
🎵 TG-1009🌐 Telugu
పల్లవి
ఆయనే నా సంగీతము - బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను || ఆయనే||
1వ చరణం
స్తుతుల మద్యలోన నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ||ఆయనే||
2వ చరణం
ఇద్దరు ముగ్గురు నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||ఆయనే||
3వ చరణం
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదను ప్రభురాకడలో నిత్యముందును - మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము ||ఆయనే||