నా తండ్రి నన్ను మన్నించు
naa thandri nannu manninchu
🎵 TG-1581🌐 Telugu
పల్లవి
నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం||
1వ చరణం
నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ఈ ప్రేమ – ఎక్కడ కనరాలేదు నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివే ||నా తండ్రి||