♪♫
TG-3796
Telugu
నాకెంతో ఆనంద
Naakentho Aanandam
0
views
పల్లవి
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో||
1వ చరణం
నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో||
2వ చరణం
నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2) నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||