TG-2672
Telugu

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు

sthuthi sinhaasanaaseenudaa naa aaraadhanaku

82
views
పల్లవి

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||

1వ చరణం

నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే – నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.