నూతన పరచుము దేవా నీ

nuuthana parachumu deevaa nee

🎵 TG-2674🌐 Telugu
పల్లవి

నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన||

1వ చరణం

శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)         ||పాతవి||

2వ చరణం

ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము

Report Error