♪♫
TG-3819
Telugu
నమ్మకమైన దేవుడవైన
Nammakamaina Devudavaina
0
views
పల్లవి
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
1వ చరణం
ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా (2) న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
2వ చరణం
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా (2) శాపము బాపే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
3వ చరణం
కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా (2) సాయము చేసే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||