♪♫
TG-3825
Telugu
నన్నాకర్షించిన నీ స్నేహ
Nannaakarshinchina Nee Sneha
0
views
పల్లవి
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా (2) నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||
1వ చరణం
మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు (2) సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
2వ చరణం
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు (2) సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||