సర్వకృపానిధి యగు ప్రభువా - సకల చరాచర సంతోషమా

sarvakrupaanidhi yagu prabhuvaa - sakala charaachara santhoossamaa

🎵 TG-1236🌐 Telugu
పల్లవి

సర్వకృపానిధి యగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముతోనిను పొగిడెదము హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ..హల్లెలూయ.. హల్లేలూయ యని పాడెదము... ఆనందముతో సాగెదము

1వ చరణం

ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి పరిశుద్దముగ జీవించుటకై - పాపిని ననుకరుణించితివి ||హల్లె||

2వ చరణం

అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాధుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలచితివి ||హలె||

3వ చరణం

మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి - మరణభయములను తీర్చితివి ||హల్లె||

4వ చరణం

భువి నుండి శ్రేష్టఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి ||హల్లె||

5వ చరణం

ఎవరు పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై హేతువు లేకయే ప్రేమించెన్‌ - యేసుకు నేనేమివ్వగలన్‌ ||హల్లె||

Report Error