సర్వోన్నతుడా నీవే నాకు - ఆశ్రయా దుర్గము

sarvoonnathudaa neevee naaku - aashrayaa durgamu

🎵 TG-1237🌐 Telugu
పల్లవి

సర్వోన్నతుడా నీవే నాకు - ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో - ఆదరణ నీవెగా -ఆనందము నీవెగా

1వ చరణం

నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట - నిలువలేరని యెహోషువతో వాగ్ధానము చేసి నావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు ||సర్వోన్నతుడా నీవే||

2వ చరణం

నిందలపాలై నిత్య నిబందన - నీతోచేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు - సింహాల నోళ్ళను మూసినావు ||సర్వోన్నతుడా నీవే||

3వ చరణం

నీతి కిరీటము ధర్శనముగా - దరించిన పరిశుద్ద పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు ||సర్వోన్నతుడా నీవే||

Report Error