♪♫
TG-3865
Telugu
నీ జీవితం క్షణ
Nee Jeevitham Kshana
0
views
పల్లవి
నీ జీవితం క్షణ భంగురం నీ యవ్వనం తృణాప్రాయం ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు ఎప్పుడు పోవునో నీకు తెలియదు ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరా ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరీ పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2) ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2) ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం||
1వ చరణం
నీకున్నవన్నియు క్షణిక సుఖములే ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2) ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2) ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం||