యెహోవా నా కాపరి

yehoovaa naa kaapari

🎵 TG-2692🌐 Telugu
పల్లవి

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు – (2) లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||

1వ చరణం

పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2)      ||లోయలలో||

2వ చరణం

గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో త్రోవ చూపి నడిపించును సేదదీర్చును చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును

Report Error