చింతెందుకు మీకు దిగులెందుకు మన

chinthenduku meeku digulenduku mana

🎵 TG-2694🌐 Telugu
పల్లవి

చింతెందుకు మీకు దిగులెందుకు మన ప్రియులు లేరని బాధెందుకు (2) కష్టాలు లేని కన్నీళ్లు లేని పరదైసులోన తానుండగా (2)        ||చింతెందుకు||

1వ చరణం

శాశ్వతము కాదు ఈ లోకము మన గమ్యస్థానము పరలోకము (2) ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా (2)       ||చింతెందుకు||

2వ చరణం

ఒకరోజు మన ప్రియుని చూస్తామనే నిరీక్షణ ప్రభువు మనకొసగెగా ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా ||చింతెందుకు||

Report Error