TG-2691
Telugu

నీ ప్రేమకు సాటి లేదయా

nee preemaku saati leedayaa

82
views
పల్లవి

నీ ప్రేమకు సాటి లేదయా యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2) నా కొరకై ప్రాణమిచ్చితివి నా కొరకై సిలువనెక్కితివి కరుణించి కాపాడుమా నా యేసయ్యా కన్నీటి ప్రార్దన ఆలకించుమా (2) ||నీ||

1వ చరణం

అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||

2వ చరణం

ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.