TG-3899
Telugu

నీ రక్త ధారలే

Nee Raktha Dhaarale

0
views
పల్లవి

నీ రక్త ధారలే – మా జీవనాధారాము నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ నీతి రాజ – యేసు రాజ (2) మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ||

1వ చరణం

మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ||

2వ చరణం

నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||