నా తోడు.. నీవే దేవా
naa thoodu.. neevee deevaa
🎵 TG-2100🌐 Telugu
పల్లవి
నా తోడు.. నీవే దేవా – నా బలము.. నీవే ప్రభువా నా ధైర్యం.. నీవే దేవా – నా సర్వం.. నీవే ప్రభువా కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా నీ దయలో.. నీ కృపలో.. నీ ఒడిలో.. నన్నిలలో నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్య సంతోషం నింపగా నిట్టూర్పు లోయలలో – గాఢాంధకారములో నీవే నా అండగా నన్ను బలపరచగా నడిపించే వాక్యం నీవైతివే కరుణించే దైవం నీవైతివే ||నీ దయలో||
1వ చరణం
ఎన్నో కలతలే నా మదిలో నిండగా నీవే యేసయ్య నా వెంటే ఉండగా నా భయమును తొలగించి – విశ్వాసము కలిగించి నీవే నా అండగా నన్ను స్థిరపరచగా నీవుంటే చాలు నా యేసయ్యా నీ ప్రేమే నాకు చూపావయ్యా