నీతో స్నేహం నే మరువగలనా
neethoo sneeham nee maruvagalanaa
🎵 TG-1400🌐 Telugu
పల్లవి
నీతో స్నేహం నే మరువగలనా నిన్ను విడచి నేను ఉండగలనా నా స్నేహితుడా… నా యేసయ్యా (2) విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో||
1వ చరణం
నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||
2వ చరణం
నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా