TG-5313
Telugu

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా

Neevu Thappa Naaku Ilaloo Evarunnaarayyaa

0
views
పల్లవి

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి  భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమవరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు ఆ సిలువలోనే నీప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా ఒక క్షణం వీడక కాపాడినావయ్యా నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా