♪♫
TG-5494
Telugu
పుట్టాడు నేడు యేసు చూడు బేత్లేహేము పురమందున
Puttaadu Needu Yeesu Choodu Beethleeheemu Puramanduna
0
views
పల్లవి
పుట్టాడు నేడు యేసు చూడు బేత్లేహేము పురమందున నీ నా పాపములు క్షమియించుటకై అవతరించే ఈ లోకాన (2) పుట్టాడు ఆ నాడు బేత్లేహేములో పుట్టాలి ఈ నాడు నీ హృదయములో (2) సంబరం సంబరం మనసంతా సంబరం ఆనందం ఆనందం జగమంతా ఆనందం (2) ||పుట్టాడు||
1వ చరణం
ప్రవచనములు నెరవేరెను పరిశుద్దుడు జన్మించేను (2) ఆయనే మన యేసుక్రీస్తు రక్షకుడు అభిశక్తుడు (2) ||సంబరం||
2వ చరణం
సమాధాన కర్త అయన విశ్వాసించు ఈ రోజున (2) దుఃఖము పోవును వేదన తీరును యేసు దీవించును (2) ||సంబరం||