TG-5495
Telugu

పుట్టాడు పుట్టాడు యేసయ్య పుట్టాడు రక్షించే రక్షకుడు

Puttaadu Puttaadu Yeesayya Puttaadu Rakshinchee Rakshakudu

25
views
పల్లవి

పుట్టాడు పుట్టాడు యేసయ్య పుట్టాడు రక్షించే రక్షకుడు నీ కొరకు పుట్టాడురో (2) రారా రారా వెళ్లదాం యేసుని స్తుతియి ద్దాం రారా రారా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2) ||పుట్టాడు||

1వ చరణం

మరణ ఛాయల్లో ఉన్నవారికి చీకటి బ్రతుకుల్లో ఉన్నవారికి (2) పాప మార్గంలో ఉన్నవారికి నరకాశిక్షలో ఉన్నవారికి (2) రక్షించుటకు పుట్టాడురో (2) ||పుట్టాడు||

2వ చరణం

గొల్లలంతా వెళ్ళిరి యేసుని స్తుతించిరి జ్ఞానులంతా వెళ్ళిరి యేసుని ఆరాధించిరి (2) మనమంతా వెళ్లదాం యేసుని స్తుతియి ద్దాం (2) మనమంతా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2) రారా రారా వెళ్లదాం యేసుని స్తుతియి ద్దాం రారా రారా వెళ్లదాం యేసుని ఆరాధిద్దాం (2) ||పుట్టాడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.