TG-5498
Telugu

పేరు పెట్టి యేసు నన్ను పిలిచెను నేను తనతో నడవాలని

Peeru Petti Yeesu Nannu Pilichenu Neenu Thanathoo Nadavaalani

19
views
పల్లవి

పేరు పెట్టి యేసు నన్ను పిలిచెను నేను తనతో నడవాలని ప్రాణమిచ్చిన యేసు నన్ను పిలిచెను నేను తనలా మారాలని అ.ప. తన అడుగుజాడలలో నడవాలని తన కోసం నేనిలలో బ్రతకాలని కష్టాలు కమ్మినా కన్నీరు నిండినా నిందలు కలిగినా ప్రభుని విడువను నను పిలిచిన వాడు నమ్మదగినవాడు కనికరపూర్ణుడు కరుణా సంపన్నుడు శోధనలొచ్చినా కలవరమొందినా హింసింపబడినను ప్రభులో నిలుతును నను పిలిచినవాడు నమ్మదగినవాడు కృపగల దేవుడు ఆదరించే నాధుడు కలిమిలో ఉన్నను లేమిలో ఉన్నను ఆపదలొచ్చినా ప్రభులో నడుతును నను పిలిచినవాడు నమ్మదగినవాడు విడువని మరువని యెడబాయని దేవుడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.