TG-5493
Telugu

పిలచినవాడవు నా ప్రియ హితుడవు

Pilachinavaadavu Naa Priya Hithudavu

18
views
పల్లవి

పిలచినవాడవు నా ప్రియ హితుడవు నా ప్రియుడా నా యేసయ్యా (2) ఓటమిలో నను నడిపించే ధైర్యము నీవే ధైర్యము నీవే ఓరిమితో నను గెలిపించే సాయుథ నీవే సాయుథ నీవే ఎంచుటకు యోగ్యత లేని నను పిలిచావే నను పిలిచావే నాలోన నీవే వుండి నడిపించావే నడిపించావే నాలోనా నే లేనే నీలాగే మారాలి నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2) ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు ||పిలచిన వాడవు||

1వ చరణం

ఈ జీవము నీదేనని తెలుసు కున్నానుగా దర మరువ లేని ఆ త్యాగము నీవు చేసావుగా నే తీర్చ లేను నీ ఋణమును చాలించక నీలో ఈ తనువును ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక నాలోనా నే లేనే నీలాగే మారాలి నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2) ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు ||పిలచిన వాడవు||

2వ చరణం

వెతికాయి నా కనులు నిజమైన ప్రేమకై స్వార్థమే లోకమంతా నిజమైన ఆ ప్రేమ కదిలించే నీ వాక్కై ఆత్మలో నీదు చెంతా ఆ ప్రేమను నే మరతునా నీ ఋణం తీరదు ఏమిచ్చినా ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక నాలోనా నే లేనే నీలాగే మారాలి నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2) ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు ||పిలచిన వాడవు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.