TG-4921
Telugu

చాటాలి జగతిలో దేవుని కీర్తి కావాలి

Chaataali Jagathiloo Deevuni Keerthi Kaavaali

17
views
పల్లవి

చాటాలి జగతిలో దేవుని కీర్తి కావాలి మనిషికి దేవుని నీతి మనుష్యుడా ఏది ఉత్తమమో ఇకనైనా నీవు తెలుసుకో లోక స్నేహమైనా అంద చందమైనా కలకాలము కలిసి రావు నీకు తోడుగా మేడ మిద్దెలైన పరువు ప్రతిష్ఠయినా చేకూర్చవు మేలులు నీకు ఎల్లవేళలా బ్రతుకుకు కావాలి శ్రేష్టమైనది బ్రతుకులు సాధించాలి నిత్యమైనవి ||మనుష్యుడా||

1వ చరణం

లోక జ్ఞానమైనా సకల శాస్త్రమైనా నిత్య జీవ మార్గము నీకు చూపలేవుగా మనుష్య నీతి అయినా బలులర్పనలైనా శాశ్వత రాజ్యములో నిన్ను చేర్చలేవుగా క్రీస్తు మాటలే జీవమైనవి దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనది క్రీస్తు మార్గమే జీవమైనది దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనది ||మనుష్యుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.