వేచియుంటిని నీ తట్టు యేసువమేము
veechiyuntini nee thattu yeesuvameemu
వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు నీవైపు ||వేచియుంటిని నీ||
కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్ స్తుతియింప ||వేచియుంటిని నీ||
నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్ ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్ నమ్మబల్కిన మీకై ||వేచియుంటిని నీ||
వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్ కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు టెప్పుడొ యంచు ||వేచియుంటిని నీ||
నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో ||వేచియుంటిని నీ||
రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై ||వేచియుంటిని నీ||