♪♫
TG-4147
Telugu
ప్రియ యేసు మన కొరకు
Priya Yesu Mana Koraku
0
views
పల్లవి
ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగ కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు||
1వ చరణం
కల్వరి కొండపైన దొంగాల మధ్యలోన సిల్వలోన వ్రేలాడెను నాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు||
2వ చరణం
ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా స్రవించె పరిశుద్ధ రక్తం ద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు||
3వ చరణం
పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు||
4వ చరణం
పాపినైన నా కొరకు ప్రేమించి ప్రాణమిచ్చెను సిల్వలో వ్రేళాడెను నీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు||