TG-5196
Telugu

నా నమ్మకం నీవే నా బలము నీవే

Naa Nammakan Neevee Naa Balamu Neevee

0
views
పల్లవి

నా నమ్మకం నీవే - నా బలము నీవే నా ధైర్యము నీవే - నా ద్వాజము నీవే ఎప్పుడూ నిలిచే నీ విశ్వాస్యత నన్ను ఉప్పొంగించే నిదు ప్రసన్నత ఒక్క క్షేణమైన నీవు నన్ను విడువక ప్రతి అడుగులలో నా తోడుంటివి అందుకే నీవే నా నమ్మకం యేసు నీ దయతో నన్ను తాకినప్పుడు – నా కళ్లలో వెలుగు నీ ప్రేమతో నన్ను మోసినప్పుడు – నా గుండెలో ఉత్సాహం ఆశలే లేని స్థితిలో - దీవెన వర్షం కురిపించితివి ప్రయాసే మిగిలే స్థితిలో - ఆశీర్వదం కుమ్మరించితివి విరిగి నలిగిన మనసులను బాగు చేసేవాడా ఎండిన బ్రతుకును జీవ జలములతో నింపేవాడా అందుకే నీవే నా నమ్మకం యేసు నా హృదయ ప్రాణేశ్వరా - నీ కొరకే ఈ జీవితం నీ పైనే ఉంచిన నమ్మకం - వ్యర్థము కాలేదయ్య కష్టాలే నను కదిలించిన - స్థితియే చేజారిపోయిన నా శరణు నీవే నా దేవుడా - నీవుంటే చాలయ్య శత్రువులే నన్ను తరుముచుండగా - నా దాగు చోటు నీవే రోగములే నన్ను క్రుంగదీయగా - నీ చెయ్యి నా స్వస్థత (2) నా నడకను నా పడకను నీ రెక్కలతో ఆశ్రయించితివి నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవరించితివి అసాధ్యము సాధ్యముగాను మరణము జీవముగాను చేసేవాడా నా పక్షమున నిలిచి - శత్రువులను తరిమి కొట్టేవాడా అందుకే నీవే నా నమ్మకం యేసు