♪♫
TG-5194
Telugu
నా దేవుని గుడారములో నా యేసుని నివాసములో
Naa Deevuni Gudaaramuloo Naa Yeesuni Nivaasamuloo
0
views
పల్లవి
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) నా యేసుని నివాసములో (2) ||నా దేవుని||
1వ చరణం
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని||
2వ చరణం
నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని||
3వ చరణం
ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||